ఎస్సారెస్పీ కాలువలో ఇద్దరి గల్లంతు
ABN , First Publish Date - 2021-03-24T06:42:27+05:30 IST
ఎస్సారెస్పీ కాలు వలో పడి ఇద్దరు గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృత దేహం లభ్యమైంది.

- ఒకరి మృతదేహం గుర్తింపు
మెట్‌పల్లి రూరల్/చందుర్తి, మార్చి23: ఎస్సారెస్పీ కాలు వలో పడి ఇద్దరు గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృత దేహం లభ్యమైంది. మరొకరి కోసం గాలింపు చేపడుతు న్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగా పూర్‌కు చెందిన (సంచార) గంగిరెద్దుల కుటుంబాలు రెండు నెలల క్రితం కూలీ పనుల కోసం వెల్లుల్ల గ్రామానికి వచ్చారు. సోమవారం రాత్రి టేకులమల్లు కొమురవ్వ(42), తన సోదరుడి కూతురు కోనరావుపేట మండలం కొం డాపూర్‌కు చెందిన గంట లావణ్యతో కలిసి దుస్తులు ఉ తకడానికి కాకతీయ కాలువ వద్దకు వెళ్లింది. ప్రమాద వశాత్తు లావణ్య కాలుజారి కాలువలో పడిపోయింది. కొమురవ్వ మేన కోడలిని రక్షించడానికి కాలువలో దూకింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ గల్లంత య్యారు. కుటుంబసభ్యులు కాలువ వెంట గాలించగా కొ మురవ్వ మృతదేహం మంగళవారం మేడిపల్లి మండలం తాటిపెల్లి గ్రామ శివారు ఎస్సారెస్పీ కాలువ వద్ద గుర్తిం చారు. లావణ్య ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ స భ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో విషా దం నింపింది. కొమురవ్వకు భర్త ఎల్లయ్య ఇద్దరు కుమారులు ఉన్నారు.