బద్దిపోచమ్మ ఆలయంలో బోనాల రద్దీ

ABN , First Publish Date - 2021-01-13T05:45:26+05:30 IST

కోరిన కోరికలు తీర్చే తల్లి వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి దేవస్థానం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది.

బద్దిపోచమ్మ ఆలయంలో బోనాల రద్దీ
బోనాలతో బారులు తీరిన భక్తులు

వేములవాడ, జనవరి 12 : కోరిన కోరికలు తీర్చే తల్లి వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి దేవస్థానం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. సోమవారం శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు తెల్లవారుజామునే భక్తిశ్రద్ధలతో నైవేద్యం వండి బోనం రూపొందించి ఊరేగింపుగా బద్దిపోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. బోనం మొక్కు చెల్లింపు కోసం భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2021-01-13T05:45:26+05:30 IST