కేంద్ర మంత్రిని కలిసిన బీఎంఎస్‌ నాయకులు

ABN , First Publish Date - 2021-12-26T06:06:13+05:30 IST

కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని శనివారం రామగుండం బీఎంఎస్‌ నాయకులు ఢిల్లీలో కలిశారు.

కేంద్ర మంత్రిని కలిసిన బీఎంఎస్‌ నాయకులు
కిషన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న నాయకులు

గోదావరిఖని, డిసెంబరు 25: కేంద్ర టూరిజం శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని శనివారం రామగుండం బీఎంఎస్‌ నాయకులు ఢిల్లీలో కలిశారు. ఆయనకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో స్థానికులకు ఉపాధి, ఇతర అంశాలపై వినతిపత్రం అందించినట్టు బీఎంఎస్‌ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యూనియన్‌ నాయకులు కల్లోల భట్టాచార్య, కంది శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో బీఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ, యాదవరాజు ఉన్నారు. 

Updated Date - 2021-12-26T06:06:13+05:30 IST