స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి

ABN , First Publish Date - 2021-11-02T05:40:10+05:30 IST

స్వచ్ఛందంగా రక్తదానం చేయాలనే తపన యువతలో కలిగి ఉండాలని ఎస్పీ సింధు శర్మ అన్నారు.

స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి
రక్తదానం చేస్తున్న జిల్లా ఎస్పీ సింధు శర్మ

ఎస్పీ సింధు శర్మ

జగిత్యాల టౌన్‌, నవంబరు 1 : స్వచ్ఛందంగా రక్తదానం చేయాలనే తపన యువతలో కలిగి ఉండాలని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జగిత్యా ల జిల్లా పోలీస్‌ శాఖ, జిల్లా రెడ్‌ క్రాస్‌ సోసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని స్థానిక విరూపాక్షి గార్డేన్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సంధు శర్మతో పాటు పోలీస్‌ అధికారులు, యువకులు 59 మంది రక్తదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం అనేది అన్ని దానాల్లోకెల్లా మహాదానమని పేర్కొన్నారు. ఆపద సమయంలో, రోడ్డు ప్రమాదాల్లో ఎందరికో రక్తం అవసరముటుందని, అలాంటి వారికి రక్తం దానం చేయడం వారి ప్రాణా లను నిలబెట్టిన వారమవుతామని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో యువత తమ చదువులు, ఉన్నత లక్ష్యాలను అధిగమించి సమాజానికి మంచి చేయాలనే తపనతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్‌ ఎస్పీ సురేష్‌కుమార్‌, డీఎస్పీ ప్రకాష్‌, రెడ్‌ క్రాస్‌ సోసైటీ సభ్యుడు మంచాల కృష్ణ ఉన్నారు.

Updated Date - 2021-11-02T05:40:10+05:30 IST