హుజురాబాద్‌లో డబ్బులు, మద్యం ఓడిపోయింది: సురేష్

ABN , First Publish Date - 2021-11-02T22:18:42+05:30 IST

హుజురాబాద్‌లో ప్రజాస్వామ్యం గెలిచిందని బీజేపీ నేత సురేష్ అన్నారు.

హుజురాబాద్‌లో డబ్బులు, మద్యం ఓడిపోయింది: సురేష్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికని, హుజురాబాద్‌లో ప్రజాస్వామ్యం గెలిచిందని బీజేపీ నేత సురేష్ అన్నారు. మంగళవారం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజురాబాద్‌లో గెలవడం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని అన్నారు. టీఆర్ఎస్‌‌లో కూడా 90 శాతం మంది ఈటల గెలవాలని కోరుకుంటున్నారని అన్నారు. ధర్మానికి.. అధర్మానికి జరిగిన ఎన్నికల్లో ధర్మం గెలిచిందన్నారు. డబ్బులు, మద్యం ఓడిపోయిందన్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందని తెలంగాణ ప్రజానీకం భావిస్తోందన్నారు. హుజురాబాద్ ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని సరేష్ అన్నారు.

Updated Date - 2021-11-02T22:18:42+05:30 IST