ముస్త్యాలలో హెల్త్‌సెంటర్ నిర్మాణానికి భూమిపూజ
ABN , First Publish Date - 2021-08-03T05:49:56+05:30 IST
రామగిరి మండలం ముస్త్యాలలో నూతనంగా నిర్మిం చనున్న హెల్త్ సబ్సెంటర్కు సోమవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్, సర్పంచ్ లావణ్యలు భూమిపూజ చేశారు.

యైటింక్లయిన్‌కాలనీ, ఆగస్టు 2: రామగిరి మండలం ముస్త్యాలలో నూతనంగా నిర్మిం చనున్న హెల్త్ సబ్సెంటర్కు సోమవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్‌కుమార్, సర్పంచ్ లావణ్యలు భూమిపూజ చేశారు. గ్రామంలో ఆరోగ్య కేంద్రం ఏర్పాటుతో చుట్టుప క్కల గ్రామాలకు త్వరితగతిన వైద్యం అందుతుందని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్ఓ డాక్టర్ శ్రీరాం, వైద్యులు సంపత్, నాగశిరోమణి, ఎంపీపీ దేవక్క, జడ్పీటీసీ శార దాకుమార్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.