గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2021-02-02T05:20:26+05:30 IST

గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగ స్వాములుకావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహార్‌రెడ్డి అన్నారు.

గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహార్‌రెడ్డి

- పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహార్‌రెడ్డి  

- కటికెనపల్లిలో ‘పల్లెప్రగతితో గ్రామ వికాసం’ ప్రారంభం

ధర్మారం, ఫిబ్రవరి1: గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగ స్వాములుకావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహార్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కటికెనపల్లిలో ‘పల్లెప్ర గతితో గ్రామ వికాసం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మనోహార్‌ రెడ్డి, అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ ప్రారంభించారు. అనం తరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతిని ధులు సమష్టిగా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ అభివృద్ధిలో అందరి బాధ్యత ఉండాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. పల్లెప్రగతితో పల్లె వికాసం కార్యక్రమం ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేకోవాల న్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, జడ్పీటీసీ సభ్యు రాలు పూస్కూరు పద్మజ, నందిమేడారం సింగిల్‌విండో చైర్మన్‌ ముత్యాల బలరాంరెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ గుర్రం మోహన్‌రెడ్డి, ఎంపీడీవో జయశీల, సర్పంచ్‌ కారుపాకల రాజయ్య, ఎంపీటీసీ సభ్యుడు సూరమల్ల శ్రీనివాస్‌, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పూస్కూరు జితేందర్‌రావు, వైస్‌ఎంపీపీ మేడవేని తిరుపతి, మార్కెట్‌ ఉపాధ్యక్షుడు గూడూరి లక్ష్మణ్‌, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామంలోని దళిత కాలనీలో ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్‌లు పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులరు సూచించారు.  

Updated Date - 2021-02-02T05:20:26+05:30 IST