బల్దియా తాత్కాలిక ఉద్యోగుల నిరసన

ABN , First Publish Date - 2021-08-25T06:06:03+05:30 IST

జగిత్యాల బల్దియా కాక్యాలయం ఎదుట హరిత హారం విభాగంలో పనిచేస్తున్న వన సేవకులతో పాటు తాత్కాలిక ఉద్యోగులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు.

బల్దియా తాత్కాలిక ఉద్యోగుల నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 24 : జగిత్యాల బల్దియా కాక్యాలయం ఎదుట హరిత హారం విభాగంలో పనిచేస్తున్న వన సేవకులతో పాటు తాత్కాలిక ఉద్యోగులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా వేత నాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ విధులు బహిష్కరించి తమ నిరస నను తెలియజేశారు. జగిత్యాల బల్దియా పరిధిలో నర్సరీల్లో మొక్కలు పెంచి సంరక్షిం చేందుకు గాను వనసేవకులతో పాటు తాత్కాలికంగా 45 మందికి పైగా నెలసరి రూ. 12 వేతనంపై నియమించారు. జనవరి 2021 నుంచి45 మంది పనిచేస్తుండగా కేవలం మూడు నెలల వేతనాలను అం దించారు. ఏప్రిల్‌ నుంచివేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులకు గు రైన తాత్కాలిక ఉద్యోగులు తమ సమస్యను కమిషనర్‌ దృష్టికి తీసుకవె ళ్లినప్పటికీ వేతనాలు మంజూరు కాలేదు. దీంతో మంగళవారం తాత్కాలిక ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి వేతనాలు చేల్లించాలని డిమాం డ్‌ చేశారు. ఏఈ ఆయూబ్‌ ఖాన్‌ సమస్యను కమిషనర్‌ దృష్టికి తీసుకవెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో తమ నిరసనను విరమించారు. ఈ ని రసన కార్యక్రమంలో తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు.


Updated Date - 2021-08-25T06:06:03+05:30 IST