నేటి నుంచి ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-03-24T06:23:04+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.

నేటి నుంచి ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌


 అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌


కరీంనగర్‌ స్పోర్ట్స్‌, మార్చి 23: ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలను జరుపుకోవాలని ప్రభుత్వం సూచించిందని తెలిపారు. అందులో భాగంగా బుధవారం జిల్లాలో ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్రీడమ్‌ రన్‌ ఉదయం 6:30 గంటలకు హెలీప్యాడ్‌ పార్కు నుంచి ప్రారంభమై ఎస్సారార్‌ కాలేజీ వద్ద ముగుస్తుందని తెలిపారు. ఫ్రీడమ్‌ రన్‌ సందర్భంగా 108 వాహనాన్ని, రెండు మెడికల్‌ బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిని ఆదేశించారు. రెండు, మూడు చోట్ల తాగునీటి సౌకర్యం కల్పించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి జనార్ధన్‌రావు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, జిల్లా ఫైర్‌ అధికారి వెంకన్న, చేనేత జౌళిశాఖ ఏఊడీ సంపత్‌, జిల్లా యువజన, క్రీడల అధికారి కె రాజవీర్‌, జిల్లా సంక్షేమాధికారి శారద, టీఎన్‌జీవో అధ్యక్షుడు మారం జగదీష్‌, ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ కనకం సమ్మయ్య, ఒలింపిక్‌ అసోసియేషన్‌ రమేశ్‌ రెడ్డి, తహసీల్దార్లు సుధాకర్‌, వెంకట్‌ రెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-03-24T06:23:04+05:30 IST