న్యూమోకాకల్‌ వ్యాక్సినేషన్‌పై అవగహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-08-10T06:33:07+05:30 IST

జిల్లాలోని ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలో సంక్ర మిం చే న్యూమోకాకల్‌ వ్యాధికి అందించే వ్యాక్సినేషన్‌పై పిల్లల తల్లిదండ్రు లకు అవగహన కల్పించాలని కలెక్టర్‌ జి. రవి అన్నారు.

న్యూమోకాకల్‌ వ్యాక్సినేషన్‌పై అవగహన కల్పించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి

జిల్లా కలెక్టర్‌ జి.రవి

జగిత్యాల, ఆగస్టు 9: జిల్లాలోని ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలో సంక్ర మిం చే న్యూమోకాకల్‌ వ్యాధికి అందించే వ్యాక్సినేషన్‌పై పిల్లల తల్లిదండ్రు లకు అవగహన కల్పించాలని కలెక్టర్‌ జి. రవి అన్నారు. సోమవారం స్థా నిక ఐఎంఏ హలులో కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సం దర్భం గా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్‌ ఆగస్టు 2021లో తెలంగాణలో ప్రవే శపెట్టారన్నారు. తల్లిపాలు ఇవ్వకపోవడం, రోగనిరోధక శక్తిలేని పిల్లలు, రద్దీ ప్రదేశాలు, హెజ్‌ఐవి సంక్రమణ, సికల్‌ సెల్‌ వ్యాధి, మూత్ర పిండ వ్యాధి గ్రస్తులలో వ్యాధి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటా యన్నారు. సంవత్సరంలోపు ఉన్న పిల్లలను గుర్తించి మొదటి, రెండవ, మూడవ డోస్‌లు ప్రతి బుధవారం, శనివారలలో సబ్‌సెంటర్‌, పిహెచ్‌ సీ, ప్రభుత్వ ఆసుపత్రిలో అందజేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నెలలు నిండని శిశువుకు 6 వారాల వయస్సులో, 6 వారాలు నిండిన త ర్వాత కానీ సాధ్యమైనంత త్వరగా టీకాలు వేయడం మొదలు పెట్టాల న్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ, జగిత్యాల ఆర్డీవో మాధురి, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ జయపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-08-10T06:33:07+05:30 IST