చట్టాలపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-10-20T06:10:06+05:30 IST

చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరమని వేములవాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి జె.వినీల్‌ కుమార్‌ సూచించారు.

చట్టాలపై అవగాహన అవసరం
మాట్లాడుతున్న జూనియర్‌ సివిల్‌ జడ్జి జె.వినీల్‌ కుమార్‌

  చందుర్తి, అక్టోబరు 19 : చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరమని వేములవాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి జె.వినీల్‌ కుమార్‌ సూచించారు. మండలంలోని మూడపల్లి, నర్సింగాపూర్‌, రామన్నపేట గ్రామాల్లో అజాద్‌కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా మంగళవారం పాన్‌ ఇండియా న్యాయా విజ్ఞాన-విస్తరణ కార్యక్రమం చేపట్టారు.   కార్యక్రమంలో సర్పంచులు చిలుక అంజిబాబు, రాపెల్లి గంగాధర్‌, దుమ్మ అంజయ్య, ఏఎస్సై బాపు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పిట్టల భూమేష్‌, సీనియర్‌ న్యాయవ్యాదులు నేరెళ్ల తిరుమల్‌ గౌడ్‌, నాగుల సత్యనారాయణ, న్యాయవాదులు అంజయ్య, దేవయ్య, ఉప సర్పంచులు రవి, శ్రీనివాసరెడ్డి  పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T06:10:06+05:30 IST