చట్టాలపై అవగాహన తప్పనిసరి

ABN , First Publish Date - 2021-10-19T05:36:53+05:30 IST

ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలని న్యాయవాది హనుమాన్‌సింగ్‌ అన్నారు.

చట్టాలపై అవగాహన తప్పనిసరి
అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న న్యాయవాది

పెద్దపల్లి రూరల్‌, అక్టోబరు18: ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన  ఉండాలని న్యాయవాది హనుమాన్‌సింగ్‌ అన్నారు. పెద్దపల్లి మండలంలోని తుర్కలమద్దికుంట గ్రామంలో ఉచిత న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహిం చారు. ఈసందర్భంగా గ్రామస్థులకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు న్యాయ సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ తంగెళ్ల జయప్రద-సంజీవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి మసియోద్దిన్‌, సంపత్‌రెడ్డి, వెంకటి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-19T05:36:53+05:30 IST