పకడ్బందీగా నూతన మున్సిపల్ చట్టం అమలు
ABN , First Publish Date - 2021-07-08T06:29:49+05:30 IST
పకడ్బందీగా నూతన మున్సిపల్ చట్టం అమలు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అన్నారు.

రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్
జగిత్యాల, జూలై 7 (ఆంధ్రజ్యోతి): పకడ్బందీగా నూతన మున్సిపల్ చట్టం అమలు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్ భవనంలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, దర్మపురి, రాయికల్ మున్సిపల్ పట్టణాల్లో నిర్వహిస్తున్న పట్టణ ప్రగ తి కార్యక్రమం, నూతన మున్సిపల్ చట్టం అమలు సంబంధిత అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీ ఆర్ ఆదేశాల మేరకు పట్టణాభివృద్ధి దిశగా అధికారు లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నూ తన మున్సిపల్ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అ క్రమ లే అవుట్లు రాష్ట్రంలో వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. దీనిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ లే అవుట్ల వి వరాలను ముందుగా సేకరించాలన్నారు. లే అవుట్లు అనుమతించే సమయంలో ఓపెన్ ల్యాండ్‌ను సదరు మున్సిపల్ పేరిట రిజిస్టర్ చేయాలని సూచించారు. నేమ్ బోర్డు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొక్కలు నా టే ప్రణాళిక రూపొందించాలన్నారు. జగిత్యాల పట్టణంలో రోడ్డుకు కిరువైపుల పెద్ద ఎత్తున్న ప్రణాళిక బ ద్దంగా మొక్కలు నాటాలన్నారు. నూతన సమీకృత క లెక్టరేట్ భవనం దాదాపుగా పూర్తయిందని, సీఎం కేసీ ఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయన్నారు. అత్యంత పారదర్శకంగా భవన అ నుమతులు అందించడానికి టీఎస్-బీ పాస్ విధానం అమలు చేస్తున్నామన్నారు. నిర్ణీత వ్యవధిలోగా దరఖా స్తుదారులకు భవన నిర్మాణ అనుమతులు జారీ చే యాలన్నారు. 75 గజాల వరకు అనుమతి అవసరం లేదని, 75 నుంచి 600 గజాల వరకు ధరఖాస్తు చేసుకొని 15 రోజుల్లో అనుమతులు పొందాలన్నారు. భవన నిర్మాణాల్లో జరుగుతున్న అవకతవకలపై మంత్రి కేటీ ఆర్ ఆగ్రహంతో ఉన్నారన్నారు. నిరంతరం పట్టణాల్లో తనిఖీలు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారన్నా రు. ప్రతీ మున్సిపాల్టీల్లో ప్రజలకు తాగునీటి సమస్య లు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ రవి, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, దర్మపురి, రాయికల్ మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.