పరిశ్రమ ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధి

ABN , First Publish Date - 2021-12-28T05:30:00+05:30 IST

ఇథనాల్‌ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ పరిశ్రమ ఏ ర్పాటుతో ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్‌ పేర్కొన్నారు.

పరిశ్రమ ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధి
స్తంభంపెల్లిలో ఇథనాల్‌ ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలిస్తున్న క్రిబ్‌కో చైర్మన్‌, మంత్రి

మంత్రి కొప్పుల ఈశ్వర్‌

వెల్గటూర్‌, డిసెంబరు 28: ఇథనాల్‌ రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ పరిశ్రమ ఏ ర్పాటుతో ప్రాంతం అభివృద్ధి చెందుతుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్‌ పేర్కొన్నారు. మంగళవారం వెల్గటూర్‌ మండలం స్తంభంప ల్లి శివారులోని 1090 సర్వే నెంబరు ప్రభుత్వ భూమిలో ఫుడ్‌ ప్రాసెసిం గ్‌ యూనిట్‌ కోసం సుమారు 100 ఎకరాల భూమిని క్రిభ్‌ కో చైర్మన్‌ డా క్టర్‌ చంద్రపాల్‌సింగ్‌, కలెక్టర్‌ జి. రవి, ఆర్డీవో మాధురి, క్రిభ్‌ కో వైస్‌ చై ర్మన్లు, డైరెక్టర్లు, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుమారు రూ.700 కో ట్లతో ఇథనాల్‌ రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయించడం హర్షించదగ్గ వియమన్నారు. త్వరలోనే ఇథనాల్‌ రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి కే భూ సేకరణ, నీటి లభ్యత, రోడ్లు, విద్యుత్‌ వంటివి సర్వే పూర్తి చేసి నట్లు తెలిపారు. రాష్ట్ర రహదారి పక్కన ఫ్యాక్టరీ ఏర్పాటు కు స్థలం దొరకడం కలిసొచ్చే అంశమన్నారు. జిల్లాలో ఒక పరిశ్రమ ఏర్పాటు కావడం సంతోషించదగ్గ విషయమన్నా రు. కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయమం టున్న తరుణంలో ఈ ప్రాంత రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. భూము ల ధరలు కూడా పెరుగుతాయని తెలిపారు. ఫ్యాక్టరీ ఏ ర్పాటు విషయంలో మంత్రి కేటీఆర్‌ చొరవ మరువలేని ద న్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సు మారు 1500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. 

 ఎనిమిది కోట్ల లీటర్ల ఇథనాల్‌ తయారీ

 క్రిభ్‌ కో చైర్మన్‌ డాక్టర్‌ చంద్రపాల్‌ సింగ్‌

వెల్గటూర్‌ మండలం స్తంభంపెల్లిలో ఏర్పాటు చేయను న్న ఇథనాల్‌ పరిశ్రమ ద్వారా ప్రతీ సంవత్సరం 8 కోట్ల లీ టర్ల ఇథనాల్‌ తయారు చేయనున్నట్లు క్రిభ్‌ కో చైర్మన్‌ డాక్టర్‌ చంద్రపాల్‌ సింగ్‌ తెలిపారు. క్రిభ్‌ కో ఎరువులను తయారు చేసే సహకార సంస్థ అన్నారు. దేశంలో మూడు చోట్ల ఇథనా ల్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుజరాత్‌ రాష్ట్రం సూ రత్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణపట్నం, తెలంగాణలో వెల్గటూర్‌ మండలం స్తంభంపెల్లిలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమ ఏర్పాటుతో ఈ ప్రాంత యువకులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. సూరత్‌లో 22 లక్షల టన్నుల ఎరువు తయారు చేస్తున్నామని తెలిపారు. అనంతరం రాయ పట్నం బ్రిడ్జి వద్ద గోదావరి నీటి నిలువలు పరిశీలించారు. ఈ కార్యక్ర మంలో నాఫెడ్‌ చైర్మన్‌ డాక్టర్‌ బిజేంద్రసింగ్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు విఎస్‌ ఆర్‌ ప్రసాద్‌, పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర మార్కెటింగ్‌ అధికారి డి.పిరెడ్డి, ప్రాజెక్టు ఇన్‌చార్జి రాంరెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీపీ లక్ష్మి లింగయ్య, జడ్పీటీసీ సుధా రామస్వామి, పీఏసీఎస్‌ అధ్యక్షులు రాంరెడ్డి, రత్నాకర్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, జగన్‌, కుమార్‌, రాంచంధర్‌, సతీష్‌, తిరుపతి, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-28T05:30:00+05:30 IST