దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

ABN , First Publish Date - 2021-12-09T05:17:08+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌ల మంజూరుకు ప్రధానోపాధ్యాయులందరూ ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అన్నారు.

దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌

కరీంనగర్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి ప్రతి నిధి): ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌ల మంజూరుకు ప్రధానోపాధ్యాయులందరూ ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమ అగర్వాల్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో  విద్యార్థుల ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుల నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం 6,240 మంది విద్యా ర్థులు అర్హత కలిగి ఉన్నారని, ఇంత వరకు 336 మంది విద్యార్థులు మాత్రమే ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు. మిగిలిన విద్యార్థుల ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ మంజూరుకు ప్రధానోపాధ్యా యులు ప్రత్యేక శ్రద్ధతో ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌ లో దరఖాస్తు చేయించాలని, సంబంధిత దరఖా స్తు ఫారాలను హాస్టల్‌ వెల్పేర్‌ ఆఫీసర్లకు అందజే యాలని ఆదేశించారు. విద్యార్థుల కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేకపోతే మూడ రోజుల్లోగా జారీ చేయాలని డిప్యూటీ తహసీల్దార్లను ఆమె ఆదేశించారు. ఉపకార వేతనాల ఆన్‌లైన్‌ రిజిస్ర్టేష న్‌లో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే హెల్ప్‌ డెస్క్‌ సెంటర్‌ 9676611730 నంబర్‌కు కార్యాల య పనివేళల్లో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో షెడ్యూల్డ్‌ కులాల అభి వృద్ధి శాఖ ఉపసంచాలకులు నతానియేల్‌, జిల్లా విద్యాధి కారి జనార్దన్‌రావు, మండల విద్యాధికారులు, ప్రధానో పాధ్యాయులు, డిప్యూటీ తహసీల్దార్లు, ఏఎస్‌ డబ్ల్యూవోలు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T05:17:08+05:30 IST