డంపింగ్‌ యార్డు వద్దని ఆందోళన

ABN , First Publish Date - 2022-01-01T05:27:35+05:30 IST

మండలంలోని మల్లన్నపల్లిలో మున్సిపల్‌ డంపింగ్‌ యార్డు ఏర్పాటును నిరసిస్తూ ప్రజలు ఆందోళన చేశారు. కాసేపట్లో ఎమ్మెల్యే చేతులమీదుగా శంకుస్థాపన జరగాల్సిన శిలాఫలకాన్ని గ్రామ మహిళలు ధ్వంసం చేశారు.

డంపింగ్‌ యార్డు వద్దని ఆందోళన

  శిలాఫలకాన్ని ధ్వంసం చేస్తున్న మహిళలు

 - శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన మల్లన్నపల్లి గ్రామస్థులు

చొప్పదండి, డిసెంబరు 31: మండలంలోని మల్లన్నపల్లిలో మున్సిపల్‌ డంపింగ్‌ యార్డు ఏర్పాటును నిరసిస్తూ ప్రజలు ఆందోళన చేశారు. కాసేపట్లో ఎమ్మెల్యే చేతులమీదుగా శంకుస్థాపన జరగాల్సిన శిలాఫలకాన్ని గ్రామ మహిళలు ధ్వంసం చేశారు. డంపింగ్‌ యార్డు వద్దని ధర్నా చేశారు. చొప్పదండి మున్సిపాలిటీ డంపింగ్‌ యార్డు ఏర్పాటు కోసం పొరుగున ఉన్న మల్లన్నపల్లి గ్రామ శివారులో స్థలాన్ని అధికారులు కేటాయించారు. డంపింగ్‌ యార్డు వద్దని ఏడాదిగా గ్రామస్థులు అధికారులకు విన్నవిస్తున్నారు.  శుక్రవారం డంపింగ్‌ యార్డు శంకుస్థాపన కోసం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ గ్రామానికి రావాల్సి ఉండగా కొంతమంది మహిళలు శిలాఫలకాన్ని ధ్వంసం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. కాగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రద్దు చేసుకున్నారు. 

Updated Date - 2022-01-01T05:27:35+05:30 IST