అంగన్‌వాడీల సంబురం

ABN , First Publish Date - 2021-08-25T06:03:38+05:30 IST

అంగన్‌ వాడీ టీచర్లు, ఆయా లకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచడంతో సంబురంలో మునిగారు.

అంగన్‌వాడీల సంబురం
బుగ్గారంలో నిర్వహిస్తున్న అంగన్‌ వాడీ కేంద్రం

- ముచ్చటగా మూడో సారి వేతనాల పెంపు

- జిల్లాలో 1,065 మంది టీచర్లు, ఆయాలకు లబ్ధి

జగిత్యాల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అంగన్‌ వాడీ టీచర్లు, ఆయా లకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచడంతో సంబురంలో మునిగారు. ఏడేళ్లలో మూడో సారి ప్రభుత్వం వేతనాలు పెంచింది. దీంతో జిల్లాలోని 1,065 మంది అంగన్‌ వాడీ టీచర్లు, ఆయాలకు లబ్ధి చేకూరనుంది.  

30 శాతం వేతనం పెంపు....

అంగన్‌ వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌ వాడీ టీచర్ల వేతనం రూ. 10, 500 నుంచి రూ. 13,650, మినీ అంగన్‌ వాడీ టీచర్ల వేతనం రూ. 6 వేల నుంచి రూ. 7,800, ఆయా వేతనం రూ. 6 వేల నుంచి రూ. 7,800 కు పెరిగింది. పెంచిన వేతనాలను జూలై, ఆగస్టు మాసం నుంచి వర్తింపజేసే అవకా శాలున్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఏడేళ్లలో అంగన్‌ వాడీల వేతనం ప్రభుత్వం మూడు పర్యాయాలు పెంచడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో 1,065 కేంద్రాలు....

జిల్లాలో నాలుగు ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌ వాడీ టీచర్లు, ఆయాలు పనిచేస్తున్నారు. జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, మల్యాల, మెట్‌పల్లిలలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో మొత్తం 1,065 కేంద్రాలు పనిచేస్తుండగా ఇందులో మెయిన్‌ అంగన్‌ వాడీ కేంద్రాలు 1,037, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 28లు ఉన్నాయి. ఒక్కో అంగన్‌ వాడీ కేంద్రంలో ఒక టీచరుతో పాటు ఒక ఆయా పనిచేస్తున్నారు. ధర్మపురి ప్రాజెక్టు పరిధిలో మొత్తం 222 కేంద్రాలకు గాను 204 మెయిన్‌ కేంద్రా లు, 18 మినీ కేంద్రాలు, జగిత్యాల ప్రాజెక్టు పరిధిలో మొత్తం 304 కేం ద్రాలకు గానూ 294 మెయిన్‌ కేంద్రాలు, 10 మినీ కేంద్రాలు, మల్యాల ప్రాజెక్టు పరిధిలో 227 కేంద్రాలకు గానూ 227 మెయిన్‌ కేంద్రాలున్నా యి. మెట్‌పల్లి ప్రాజెక్టు పరిదిలో మొత్తం 312 కేంద్రాలకు గానూ 312 మెయిన్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మల్యాల, మెట్‌పల్లి ప్రాజెక్టుల పరి ధిలో మినీ అంగన్‌ వాడీ కేంద్రాలు పనిచేయడం లేదు. జిల్లాలో 7,609 మంది గర్భిణులు, 7,980 మంది బాలింతలు, 7 నెలల నుంచి ఒక సం వత్సరం లోపు పిల్లలు 7,186 మంది, ఒక సంవత్సరం నుంచి 3 సంవత్స రాల లోపు పిల్లలు 27,754 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు 27,259 మంది ఉన్నారు. జిల్లాలో 66,596 మంది అనుబంద పోషకా హార లాభోక్తులయిన గర్భిణులు, బాలింతలు, నిర్ణీత వయస్సులోపు గల పిల్లలకు అంగన్‌ వాడీ టీచర్లు, ఆయాలు సేవలను అందిస్తున్నారు.

స్త్రీ, శిశు సంక్షేమంలో అంగన్‌వాడీలు కీలకం...

జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ కార్యక్రమాల్లో అంగన్‌ వాడీ టీచర్లు, ఆయా లు కీలక పాత్ర పోషిస్తున్నారు. సర్కారు ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా ప్రచారంచేయడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో బాగస్వా మ్యం అవడం వంటివి జరుపుతున్నారు. చిన్న పిల్లల సంరక్షణ, ఆటా పాటలతో కూడిన విద్యనందించేందుకు ముందుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న అంగన్‌ వాడీ టీచర్లకు మూడో పర్యాయం వేతనం పెంచడంతో సంబురాల్లో మునిగారు. 

ఆర్థికంగా ఆసరా...

- సుందగిరి గంగమణి, అంగన్‌ వాడీ టీచర్‌, డబ్బ గ్రామం

పెరిగిన వేతనాలతో అంగన్‌ వాడీ టీచర్ల కుటుంబాలకు మరింత ఆ ర్థిక ఆసరా పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాల ను పెంచడం వల్ల సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుంది. అంగన్‌వా డీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాము.

బాధ్యతాయుతంగా పనిచేయాలి

- బోనగిరి నరేశ్‌, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమాధికారి, జగిత్యాల

అంగన్‌ వాడీ టీచర్లు, మినీ అంగన్‌ వాడీ టీచర్లు, ఆయాలకు రాష్ట్ర ప్రభుత్వం సముచితంగా వేతనాలను పెంచింది. వేతనాలు పెంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలిగిపోయే అవకాశాలున్నాయి. అంగన్‌వాడీలకు ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు, సక్రమంగా నిర్వ ర్తించాలి. ప్రతీ ఒక్కరూ మరింత బాధ్యతయుతంగా పనిచేయాలి. స్త్రీ, శిశు సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేయాలి.


Updated Date - 2021-08-25T06:03:38+05:30 IST