ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి

ABN , First Publish Date - 2021-12-07T06:14:52+05:30 IST

యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని, వానకాలం ధాన్యం నిలువలు అధికంగా ఉండటంతో ప్రభుత్వం కొనుగోలు చేయదని అందుకే వరికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్‌ జి. రవి అన్నారు.

ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌

- రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు 

- కలెక్టర్‌ జి.రవి 

ఇబ్రహీంపట్నం,డిసెంబరు 6: యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలను సాగు చేయాలని, వానకాలం ధాన్యం నిలువలు అధికంగా ఉండటంతో ప్రభుత్వం కొనుగోలు చేయదని అందుకే వరికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్‌ జి. రవి అన్నారు. ధాన్యం కోనుగోలులో రైతులను ఇబ్బం దులకు గురిచేసి మిల్లర్లు అవకతవకలకు పాల్ప డితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చ రించారు. సోమవారం మండలంలోని అమ్మ క్కపేట్‌, గోధుర్‌, ఇబ్రహీంపట్నం గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను పరిశీలిం చారు. ఇబ్రహీంపట్నం రైతు వేదిక భవనంలో  పంటమార్పిడి సాగు విధానంపై  ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఈ యాసంగిలో ప్రభుత్వం వరి ధాన్యం  కొనుగోలు చేయదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. వరికి బదులు రైతులు ఏ పంటలు వేయాలో వ్యవసాయధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.  లాభాలున్న ఇతర పంటలు సాగు చేయాలని సూచించారు. ఆయా గ్రామాల్లో కోనుగోలు కేంద్రాలను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించి ధాన్యం కోనుగోలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేష్‌కుమార్‌, మెట్‌పల్లి ఆర్‌డిఓ వినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ రమేష్‌, వైద్యా ధికారులు, వ్యవసాయధికారులు, నాయకులు, రైతు లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T06:14:52+05:30 IST