అత్తను హత్య చేసిన అల్లుడి అరెస్ట్
ABN , First Publish Date - 2022-01-01T05:00:02+05:30 IST
అదనపు కట్నంగా భూ మిని ఇవ్వటం లేదని మండలంలోని కోనాపూర్ గ్రా మానికి చెందిన జడ రాజవ్వను ఈ నెల 28న హత్య చేసిన అల్లుడు గంగాధర్‌ను శుక్రవారం పోలీసులు అ రెస్ట్ చేశారు.

కొడిమ్యాల, డిసెంబరు 31 : అదనపు కట్నంగా భూ మిని ఇవ్వటం లేదని మండలంలోని కోనాపూర్ గ్రా మానికి చెందిన జడ రాజవ్వను ఈ నెల 28న హత్య చేసిన అల్లుడు గంగాధర్‌ను శుక్రవారం పోలీసులు అ రెస్ట్ చేశారు. హత్య జరిగిన మూడు రోజులలో కేసును పోలీసులు చేదించారు. శుక్రవారం సాయంత్రం కొడి మ్యాల పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ మాట్లాడు తూ కోనాపూర్ గ్రామానికి చెందిన రాజవ్వ కూతురు మౌని కకు కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెంది న గంగాధర్‌కు వివాహం అయింది. అదనపు క ట్నం కింద భూమి ఇస్తానని ఇవ్వటం లేదని గంగాధర్ తన భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఉపాధి కోసం ఇటీవలే విదేశాలకు వెళ్లి వచ్చాడు. వచ్చిన వెంటనే తనకు ఇస్తానన్న భూమి ఇవ్వాలంటూ అత్తతో గొడవ పడేవాడు. కొద్ది రోజుల కింద మౌనిక తన అమ్మ ఇంటికి రావడంతో గంగాధర్ కూడా మంగళవారం కోనాపూర్‌లోని అత్తారింటికి వచ్చాడు. భూమి కోసం మళ్లీ భార్య తో గొడవకు దిగాడు. కోపంతో అక్కడే ఉన్న కర్రతో భా ర్యను కొట్టబోతుండగా అత్త అడ్డు వచ్చింది. దీంతో ఆమెకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు డీఎస్పీ వివరించారు. శుక్రవారం నాచుప ల్లి సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమా నాస్పదంగా తిరుగుతున్న గంగాధర్‌ను పట్టుకొన్నామ న్నారు. సైకిల్ మోటారు, సెల్‌ఫోన్, కర్రను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశామన్నారు. ఈ సమావేశంలో మల్యాల సీఐ రమణమూర్తి, ఎస్సై శివానిరెడ్డి ఉన్నారు.