80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతివ్వండి

ABN , First Publish Date - 2021-09-03T05:16:10+05:30 IST

వానాకాలంలో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కేంద్రాన్ని కోరారు.

80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతివ్వండి
కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ కార్యదర్శి సుధాన్ష్‌పాండేకు వినతిపత్రం అందజేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌

 మంత్రి గంగుల కమలాకర్‌

 కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ కార్యదర్శితో సమావేశం 

కరీంనగర్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వానాకాలంలో 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కేంద్రాన్ని కోరారు. గురు వారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ కార్యదర్శి సుధాన్ష్‌పాండేతో కృషీభవన్‌లో భేటీ అయి ధాన్యం సేకరణ అంశాలపై చర్చించారు. యాసంగి లో 50 లక్షల మెట్రిక్‌ టన్నుల పారా బాయిల్డ్‌ రైస్‌ను ఎఫ్‌సీఐ తీసుకొని రైతులకు మేలు చేయాలని కోరారు. 2019-20 యాసంగిలో నష్టపోయిన 30 రోజులను భర్తీచేసి మిగిలిన బియ్యాన్ని అందించేందుకు మరో 30 రోజుల గడువు పెంచాలన్నారు. తెలంగాణలో మిల్లింగ్‌ కొనసాతున్నందున సత్వర పరిష్కారం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T05:16:10+05:30 IST