వాహనాలకు ఆన్‌లైన్‌లో ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపు

ABN , First Publish Date - 2021-02-05T05:51:06+05:30 IST

నూతన వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు ఫిబ్రవరి 5 నుంచి ఆన్‌లైన్‌లో ఉంటుం దని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా డీటీసీ మామిడ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ తెలిపారు.

వాహనాలకు ఆన్‌లైన్‌లో ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపు
మాట్లాడుతున్న డీటీసీ మామిడ్ల చంద్రశేఖర్‌గౌడ్‌

నేటి నుంచి అమలు  

డీటీసీ మామిడ్ల చంద్రశేఖర్‌గౌడ్‌

తిమ్మాపూర్‌, ఫిబ్రవరి 4: నూతన వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు ఫిబ్రవరి 5 నుంచి ఆన్‌లైన్‌లో ఉంటుం దని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా డీటీసీ మామిడ్ల చంద్రశేఖర్‌గౌడ్‌ తెలిపారు. గురువారం తిమ్మాపూర్‌ రవాణాశాఖ కార్యాలయంలో ప్రభుత్వం విడుదల చేసి న నూతన మార్గదర్శకాలను ఆయన వివరించారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ట్రాన్స్‌పోర్టు.తెలంగాణ.జీవోవీటి.ఇన్‌ లో అప్లై ఫర్‌ రిజర్వేషన్‌ ఆఫ్‌ స్పెషల్‌ నంబర్‌ క్లిక్‌ చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించాలన్నారు. ఒక ప్రత్యేక నెంబరుకు ఒకటి కంటే ఎక్కువ దరకాస్తులు దాఖలు చేస్తే యజమాని దరకాస్తు చేసిన నంబర్‌కు బిడ్‌ మొత్తాన్ని చెల్లించి బిడ్‌ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆన్‌లైన్‌ సమర్పించాలన్నారు. దరఖాస్తు సమయంలో చెల్లించిన ప్రారంభ మొత్తం కంటే బిడ్‌ మొత్తం ఎక్కువగా ఉండాలన్నారు. నిర్ణీత సమయంలో బిడ్‌ చెల్లించకపోతే  చెల్లించిన ప్రారంభ మొత్తం తిరిగి చెల్లించబడదని తెలిపారు. నంబరు కేటాయించిన తేదీ నుంచి 15రోజుల్లోగా వాహనాన్ని రిజిస్టర్‌ చేసుకోవాలన్నారు. లేకుంటే కేటాయించిన నంబరు రద్దు అవుతుందని తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో నంబరు దరఖాస్తు చేసు కోవాలన్నారు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే ఆన్‌లైన్‌లో బిడ్‌ సమర్పించాలని డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్‌ తెలిపారు. 

Updated Date - 2021-02-05T05:51:06+05:30 IST