ఈటలపై భూకబ్జా ఆరోపణలు సరికాదు

ABN , First Publish Date - 2021-05-03T05:11:54+05:30 IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు చేయటం సరికాదని ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య, అధికార ప్రతినిధి భూమి రమణకుమార్‌ అన్నారు.

ఈటలపై భూకబ్జా ఆరోపణలు సరికాదు
కొడిమ్యాలలో నిరసన వ్యక్తం చేస్తున్న ముదిరాజులు

- ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షుడు  పులి నర్సయ్య

కొడిమ్యాల, మే 2: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు చేయటం సరికాదని ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షుడు  పులి నర్సయ్య, అధికార ప్రతినిధి భూమి రమణకుమార్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఎదుట మండల ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్‌ అధ్యక్షతన  ముదిరాజులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమానికి ముందు 120 ఎకరాలు ఉన్న భూమి నుంచి ఉద్యమం కోసం 50 ఎకరాల భూమిని అమ్ముకున్నాడన్నారు. మంత్రి స్థాయికి ఎదిగిన రాజేందర్‌పై అసత్య ఆరోపణలు చేస్తూ బురద చల్లటం సరికాదన్నారు. బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఓర్వలేక, మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయటానికి తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. పార్టీలో ఉండి భూకబ్జాలు చేసిన వారు ఎందరో ఉన్నారని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్‌ సర్పంచ్‌ సామంతుల ప్రభాకర్‌, ముదిరాజ్‌ మహాసభ నాయకులు శ్రీనివాస్‌, గడ్డమీది గంగయ్య, చిన్న అంజయ్య, చొక్కాల రాజేశం, బల్ల పోచమల్ల్లు, వివిద గ్రామాల ముదరాస్‌ మహాసభ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-03T05:11:54+05:30 IST