అలిశెట్టి రచనలు అక్షర కర దీపికలు

ABN , First Publish Date - 2021-01-13T05:39:01+05:30 IST

తెలంగాణ అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్‌ రచనలు ముందు తరాలకు అక్షర కర దీపికలు అని ఎమ్మెల్యే సంజయ్‌ కుమా ర్‌ అన్నారు.

అలిశెట్టి రచనలు అక్షర కర దీపికలు
అలిశెట్టి ప్రభాకర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే

జయంతి, వర్థంతి వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, జనవరి 12: తెలంగాణ అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్‌ రచనలు ముందు తరాలకు అక్షర కర దీపికలు అని ఎమ్మెల్యే సంజయ్‌ కుమా ర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంగడిబజార్‌లో ఉన్న అలిశెట్టి విగ్రహం వద్ద జగిత్యాల జిల్లాకు కవులు, ప్రభాకర్‌ మిత్ర బృంధం, ఫొటో, వీడియో గ్రాఫర్లు, బీసీ సంక్షేమ సంఘం, టీబీసీ జేఏసీ ఆధ్వర్యంలో అలిశెట్టి ప్రభాకర్‌ జయంతి, వర్థంతి నిర్వహించారు. 

ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, బల్దియా చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, టీపీసీసీ ఆర్గ నైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌ హాజరై ప్రభాకర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభాకర్‌ సాహిత్యం సమాజహితాన్ని కోరిందని, సమాజ రుగ్మతలు రూపు మాపడానికి అతని అక్ష రాలు దోహదం చేసిందని పేర్కొన్నారు. జననం, మరణం ఒకే రోజు కావడం ఇది మహానుభావులకే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అలిశెట్టి ప్రభాక ర్‌ అభిమానులు, కవులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T05:39:01+05:30 IST