మద్యం కొత్త పాలసీ

ABN , First Publish Date - 2021-10-07T05:59:10+05:30 IST

రాష్ట్రంలో మద్యం దుకాణాల కు కొత్త పాలసీని అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో అ బ్కారి అధికారులు ఆ దిశగా కసరత్తులు చేస్తున్నారు.

మద్యం కొత్త పాలసీ

- డిసెంబర్‌ నుంచి అమలుకు కసరత్తు

- ఫీజు చెల్లింపుతో రెన్యూవల్‌ అయిన బార్‌ అండ్‌ రెస్టారెంట్లు

- గౌడ కులస్థులకు 15.. ఎస్సీలకు 10.., ఎస్టీలకు 5 శాతం కేటాయింపు

జగిత్యాల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో మద్యం దుకాణాల కు కొత్త పాలసీని అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడంతో అ బ్కారి అధికారులు ఆ దిశగా కసరత్తులు చేస్తున్నారు. వచ్చే డిసెంబర్‌ మాసం నుంచి కొత్త పాలసీని అమలు చేయడానికి అవసరమైన చర్య లు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సయిజ్‌ శాఖ అధికారులు తీసుకుంటున్నారు. తొలిసారిగా వైన్స్‌ దుకాణాల కేటాయింపులో ప్రత్యేక రిజర్వేషన్లను అమ లు చేయనున్నారు. గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీ సామాజిక వర్గాని కి 10 శాతం, ఎస్టీ సామాజిక వర్గానికి 5 శాతం దుకాణాలను కేటాయిం చనున్నారు. వైన్స్‌ దుకాణాల కేటాయింపులో ప్రత్యేక రిజర్వేషన్లను అమ లు చేయనుండడంతో సంబందిత వర్గాల్లో ఆనందోత్సహాలు వ్యక్తం అవు తున్నాయి. ఈ దుకాణాలన్నింటిని జనాభా ప్రాతిపదికన గానీ, లాటరీ సిస్టం ద్వారా గానీ కేటాయించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నా యి. ఆయా కులస్థులు మాత్రమే దరఖాస్తు చేసుకుంటే లక్కీ డీప్‌ ద్వా రా అర్హత కలిగిన వారిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మిగితా దుకాణాలకు ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవకాశాలు కల్పిస్తున్నారు. 


జిల్లాలో మూడు సర్కిళ్లు...

జిల్లాలో మెట్‌పల్లి, ధర్మపురి, జగిత్యాల కేంద్రాలుగా ఎక్సయిజ్‌ సర్కిల్‌ లు పనిచేస్తున్నాయి. వీటితో పాటు ఒకటి టాస్క్‌ఫోర్స్‌ సర్కిల్‌ పనిచే స్తోంది. జిల్లాలో 64 వైన్స్‌లు, 22 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు పనిచేస్తున్నా యి. ఇందులో జగిత్యాల ఎక్సయిజ్‌ సర్కిల్‌ పరిధిలోని మండలాల్లో 27 లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాలు, 10 బార్‌ అండ్‌ రెస్టారెంట్లున్నాయి. ధర్మ పురి ఎక్సయిజ్‌ సర్కిల్‌లో 16 మద్యం లైసెన్స్‌డ్‌ దుకాణాలు, 5 బార్‌ అం డ్‌ రెస్టారెంట్లు, మెట్‌పల్లి ఎక్సయిజ్‌ సర్కిల్‌ పరిధిలో 21 వైన్స్‌ దుకా ణాలు, 7 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. సంబందిత లైసెన్స్‌ డ్‌ దుకాణాల నిర్వాహకులు ఎక్సయిజ్‌ నిబంధనల మేరకు వ్యవహరిం చాల్సి ఉంటోంది. జిల్లాలో మూడు సర్కిళ్లతో పాటు ఒకటి టాస్క్‌ఫోర్స్‌ టీం పనిచేస్తోంది. నిబంధనలు ఖచ్చితంగా అమలు అయ్యేలా అధికారు లు పర్యవేక్షణ జరపాల్సి ఉంది.


గడువు పెంపు....

జిల్లాలో 2019 అక్టోబర్‌ మాసంలో మద్యం దుకాణాలకు టెండర్లను నిర్వహించారు. ఆ సమయంలో దుకాణాలు దక్కించుకున్న వ్యాపారు లకు గడిచిన అక్టోబర్‌ వరకు గుడువు ఉంది. కరోనా ప్రభావం వల్ల లాక్‌ డౌన్‌ అమలు చేయడం, నూతన మద్యం పాలసీని అమలు చేసే క్ర మంలో ఆ దుకాణాల గడువును మరో నెల రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది. దీంతో రానున్న నవంబర్‌ వరకు దుకాణాల నిర్వాహకు లు మద్యం అమ్ముకునే వీలు కలిగింది. డిసెంబర్‌ ఒకటవ తేదీ నుంచి తిరిగి కొత్త మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వనున్నారు. జిల్లాలో బా ర్‌ అండ్‌ రెస్టారెంట్లకు ఫీజు ఒక నెల రోజుల కాలం పరిధిలో ఫీజు చె ల్లింపులో తగ్గింపును వర్తింపజేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీం తో సెప్టెంబర్‌ లోపు జిల్లాలోని 21 బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వాహకు లు ఫీజులు చెల్లించి తమ లైసెన్స్‌ను రెనివల్‌ చేసుకున్నారు. మెట్‌పల్లి ఎక్సయిజ్‌ సర్కిల్‌ పరిధిలోని ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వాహకుడు మాత్రమే రెనివల్‌ చేసుకోలేదని ఎక్సయిజ్‌ వర్గాలు అంటున్నాయి. 


కొత్త పాలసీ ప్రకారం...

జిల్లాలో 2021-22, 2022-23 సంవత్సరాలకు ప్రత్యేక రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేయనుంది. డిసెంబర్‌లో అమలు చేయనున్న కొత్త పాలసీ ప్రకారం జిల్లాలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని దుకాణాలు కేటా యిస్తారన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకా రం గౌడ్‌ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయింపులు జరపాల్సి ఉంది. జిల్లాలో 64 వైన్స్‌ దుకాణాలున్నాయి. దీంతో జిల్లాలో గౌడ కులస్థులకు సుమారు 9 నుంచి 10 దుకాణాలు, ఎ స్సీలకు 4 నుంచి 5 దుకాణాలు, ఎస్టీలకు 2 నుంచి 3 దుకాణాలను కే టాయిస్తారన్న అంచనాలున్నాయి. రానున్న కొత్త పాలసీ ప్రకారం దర ఖాస్తులు భారీగా పెరిగే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.  


ఎక్సయిజ్‌ చట్టంలో సవరణకు కసరత్తులు...

జిల్లాలో వాస్తావానికి నవంబర్‌ 1వ తేది నుంచి రాబోయే రెండేళ్లకు సంబంధించి కొత్త పాలసీని అమలులోకి తేవాల్సి ఉంది. రిజర్వేషన్ల అ మలు నేపథ్యంలో దుకాణాలకు సంబంధించి గౌడ్‌, ఎస్సీ, ఎస్టీ సామా జిక వర్గాలకు 30 శాతం వరకు రిజర్వేషన్లను కేటాయించడానికి సర్కా రు నిర్ణయం తీసుకుంది. ఇందుకు మొదట ఎక్సయిజ్‌ చట్టంలో సవరణ చేయాల్సి ఉంది. ఆ సవరణను శాసన సభ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువును పొడిగిస్తూ గత నెల 24వ తేదీన ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో నవంబర్‌ 30వ తేదీ వరకు ప్రస్తుత లైసెన్స్‌ దారులనే కొనసాగిస్తారు. మద్యం దుకాణాల కేటాయిం పు, రిజర్వేషన్ల అమలు, వ్యాపారులకు వచ్చే మార్జిన్‌ తదితర అంశాలపై ఎక్సయిజ్‌ అధికారులు విస్తృత కసరత్తులు చేస్తున్నారు. 


సర్కారు నిర్ణయం సంతోషకరమే..

 అంగ రవి కుమార్‌ గౌడ్‌, గీతకార్మిక సంఘం నాయకుడు

మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేయడానికి సర్కారు తీసుకున్న నిర్ణయం సంతోషకరమే. ఇప్పటి వరకు కల్లు విక్రయాల్లో కీలక పాత్ర పోషించిన గౌడ కులస్థులు ఇక నుంచి మద్యం విక్రయాల్లోనూ భాగస్వామ్యం కానున్నారు.

కొత్త విధానంపై మార్గదర్శకాలు రావాల్సి ఉంది

- శ్రీధర్‌, జిల్లా ఎక్సయిజ్‌ సూపరెండెంట్‌

జిల్లాలో డిసెంబర్‌ మాసం నుంచి కొత్త మద్యం పాలసీ అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులు కసరత్తులు చేస్తున్నారు. కొత్త విధానంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకు అవసరమైన మార్గద ర్శకాలు రావాల్సి ఉంది. కొత్త మద్యం పాలసీ ద్వారా గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం చొప్పున దుకాణాలు కేటాయించనున్నారు.

Updated Date - 2021-10-07T05:59:10+05:30 IST