రైతును రాజుగా చూడడమే ప్రభుత్వ లక్ష్యం
ABN , First Publish Date - 2021-10-28T06:09:30+05:30 IST
రైతును రాజుగా చూడడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్‌పర్సన్ అరుణ రాఘవరెడ్డి, ఎమ్మెల్యే రమేష్‌బాబు అన్నారు.

- జడ్పీ చైర్‌పర్సన్ అరుణ, ఎమ్మెల్యే రమేష్‌బాబు
కోనరావుపేట, అక్టోబరు 27 : రైతును రాజుగా చూడడమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యమని జడ్పీ చైర్‌పర్సన్ అరుణ రాఘవరెడ్డి, ఎమ్మెల్యే రమేష్‌బాబు అన్నారు. మండలంలోని కొలనూరు, కనగర్తి తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామన్నారు. ఒకప్పుడు రైతు బతుకుదెరువు కోసం వ్యవసాయం చేశాడని, టీఆర్‌ఎస్ పార్టీ వచ్చిన తరువాత లాభాల కోసం చేస్తున్నాడని అన్నారు. రైతుల కోసం సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నట్లు చెప్పారు. రైతులు చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలన్నారు. అంతకుముందు కొలనూరుతోపాటు పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదులతోపాటు మౌలిక వసతుల కల్పనకు నిధులలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ధర్మారంలో రేణుకామాత కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మాండ్లు, ఫ్యాక్స్ చైర్మన్‌లు బండ నర్సయ్య, రామ్మోహన్‌రావు, వైస్ ఎంపీపీ సుమలత, సర్పంచులు భారతి బాపురెడ్డి, యమున, గున్నాల అరుణ లక్ష్మణ్, ఎంపీటీసీలు లక్ష్మి, ప్రవీణ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, డీసీవో బుద్ధనాయుడు, ఎంపీడీవో రామకృష్ణ, తిరుపతి, రాఘవరెడ్డి, గోపిరావు, దేవరకొండ తిరుపతి పాల్గొన్నారు.