అంతర్గాం మండలంలో అదనపు కలెక్టర్‌ పర్యటన

ABN , First Publish Date - 2021-11-23T06:13:06+05:30 IST

అంతర్గాం మండలంలోని కుందనపల్లి పంచాయతీ పరిధి అక్బర్‌నగర్‌, బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధి మర్రిపల్లిలో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పర్యటించారు.

అంతర్గాం మండలంలో అదనపు కలెక్టర్‌ పర్యటన
వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తున్న అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

అంతర్గాం, నవంబరు 22: అంతర్గాం మండలంలోని కుందనపల్లి పంచాయతీ పరిధి అక్బర్‌నగర్‌, బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధి మర్రిపల్లిలో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పర్యటించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్లు తీసుకోని పలువురి ఇళ్లను సందర్శించారు. అపోహల కారణంగా టీకాలు తీసుకోని వారికి అవగాహన కల్పించారు. కరోనా వ్యాక్సిన్‌ పూర్తిగా సురక్షితమైనదని ప్రజలంతా విధిగా వ్యాక్సిన్లు తీసుకొని కరోనా వ్యాప్తిని అరికట్టాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకునేలా స్థానిక మెడికల్‌, పంచాయతీ ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ, ఎంపీడీఓ బీ యాదగిరి, మెడికల్‌ ఆఫీస్‌ సురేష్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ సురేష్‌, పంచాయతీ కార్యదర్శులు పీ సతీష్‌, గీతవాణి, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-23T06:13:06+05:30 IST