మోసాలకు పాల్పడితే చర్యలు

ABN , First Publish Date - 2021-08-10T06:14:52+05:30 IST

చిట్‌ ఫండ్స్‌ యాజమాన్యం మోసా లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

మోసాలకు పాల్పడితే చర్యలు
ప్రజాదివస్‌లో ఫిర్యాదు స్వీకరిస్తున్న ఎస్పీ

సిరిసిల్ల క్రైం, ఆగస్టు 9: చిట్‌ ఫండ్స్‌ యాజమాన్యం మోసా లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చిట్‌ పండ్స్‌ కంపెనీల్లో ఖాతాదారులకు డబ్బుల చెల్లింపుల్లో ఇబ్బందులకు గురిచేస్తే యాజమాన్యంపై చట్టపర మైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని చిట్‌ఫండ్‌ సంస్థలు గడవుతీరినా ఖాతాదారులకు డబ్బులు చెల్లించడం లేదని ఫిర్యాదులు అందాయన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండాచిట్‌ఫండ్‌ సంస్థలు మోసాలకు పాల్ప డుతున్నాయన్నారు. చిట్‌ఫండ్‌ సంస్థలపై ఎలాంటి ఫిర్యాదులు అందినా కేసులు నమోదు చేస్తామన్నారు.   

ప్రజాదివస్‌లో 5 ఫిర్యాదులు

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్‌లో 5 ఫిర్యాదులు అందాయని ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు. ఈ ఫిర్యాదులను సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు పంపించినట్లు, బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సివిల్‌ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలన్నారు. 

Updated Date - 2021-08-10T06:14:52+05:30 IST