ఎమ్మెల్యేకు పిండప్రదానం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-03-22T06:24:51+05:30 IST

ఎమ్మెల్యే రమేష్‌బాబుకు పిండప్రదానం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హ న్మాండ్లు అన్నారు.

ఎమ్మెల్యేకు పిండప్రదానం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలు


వేములవాడ టౌన్‌, మార్చి 21 : ఎమ్మెల్యే రమేష్‌బాబుకు పిండప్రదానం చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డం హ న్మాండ్లు అన్నారు. వేములవాడ నియోజకవర్గం కథలాపూర్‌ మండలంలో కొంత మంది ఎమ్మెల్యే రమేష్‌బాబుకుపై అనుచిత వాఖ్యలు చూస్తూ పిండప్రదానం చేయడం వాళ్ల విగ్నతకే వదిలేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేకు పిండప్రదానం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశా మని వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్‌ కమిటీ వైస్‌-చైర్మన్‌ ఊరడి ప్రవీణ్‌కుమార్‌, మాజీ సెస్‌ డైరెక్టర్‌ జడల శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ మేర్గు రఘు, కౌన్సిలర్‌ నిమ్మశెట్టి విజయ్‌, నాయకులు ఏశ తిరుపతి, యామ తిరుపతి, రెడ్డవేని పర్శరాములు, గుండెకార్ల నరేష్‌, కృష్ణదేవరావు, చెన్నమ నేని స్వయం ప్రభ, కొమురవ్వ, జల, ముత్త మహేష్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-03-22T06:24:51+05:30 IST