నిందితుడిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-31T06:27:40+05:30 IST

ప్రభుత్వం, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహ రించాలని, బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

నిందితుడిపై చర్యలు తీసుకోవాలి
మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 30: ప్రభుత్వం, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహ రించాలని,  బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.  ఎక్కడ ఉన్నా ఏ చిన్న సంఘటనకైనా మంత్రి కేటీఆర్‌ స్పందిస్తుంటారని, ఆయన నియోజక వర్గంలోని టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినా స్పందించ లేదని అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోతే పెద్ద ఎత్తున్న కాంగ్రెస్‌, మహిళా విభాగం, ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారా యణ, వేములవాడ నియోజక వర్గం ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు అకునూరి బాలరాజు,  మహిళా జిల్లా అధ్యక్షురాలు మడుపు శ్రీదేవి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, మాజీ కౌన్సిలర్‌ ఆడెపు చంద్రకళ, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, యువజన కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

చట్ట పరంగా చర్యలు తీసుకోవాలి

బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీఆర్‌ఎస్‌ నాయకుడిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం ఎస్పీ రాహుల్‌ హెగ్డేకు వినతి పత్రం అందజేశారు.  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌,  కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్‌   ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూర దేవరాజు, మహిళా జిల్లా అధ్యక్షురాలు మడుపు శ్రీదేవి, నాయకులు  ఉన్నారు. 

 టీఆర్‌ఎస్‌ పార్టీ పేరును మార్చుకోవాలి 

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును తెలంగాణ రేప్‌ల పార్టీగా మార్చుకోవాలని శనివారం కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ నియోజవర్గంలోనే మహిళలు, యువ తులు, బాలికలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఎల్లారెడ్డి పేటలో గతంలోనూ ఎన్నో జరిగాయని, అందులో తాజా సంఘటన ఒక్కటే బయటకు వచ్చిందని తెలిపారు.  నియోజక వర్గంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, పోలీసులు కేవలం ఉత్సవ విగ్రహాలుగా వ్యవహరి స్తున్నారని పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బాలికల హాస్టల్‌లో, ఎల్లారెడ్డి పేట మండలం అల్మాస్‌పూర్‌లో జరిగిన సంఘటనలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నాయకులే ఉన్నారని తెలిపారు. దీనిపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్‌   రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-10-31T06:27:40+05:30 IST