టీఆర్‌ఎస్‌ నాయకుల అధికార దుర్వినియోగం

ABN , First Publish Date - 2021-05-02T05:53:16+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి అక్రమాలకు తెరలేపుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు విమర్శించారు

టీఆర్‌ఎస్‌ నాయకుల అధికార దుర్వినియోగం
సమావేశంలో మాట్లాడుతున్న ప్రదీప్‌రావు

పెద్దపల్లి టౌన్‌, మే 1: రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి అక్రమాలకు తెరలేపుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు విమర్శించారు. స్థానిక నందన గార్డెన్లో శనివా రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఎందరో మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి అక్రమాలకు పాల్పడితే ఎలాంటి విచార ణకు ఆదేశించని ప్రభుత్వం ఈటల రాజేందర్‌పై ఆదేశాలు జారీ చేయడం వెనుకున్న కుట్ర ప్రజలకు అర్ధం అవుతోందన్నారు.  అవినీతి ఆరోపణలున్న అందరిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కరోనా కట్టడిలో విఫలమైన సీఎం కేసీఆర్‌ కప్పి పుచ్చుకునేందుకు డ్రామా తెరపైకి తెచ్చాడని విమర్శిచారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఎన్నో అవి నీతి అక్రమాలు ఆధారాలతో బయట పడ్డా ఒక్క విచారణ చేపట్టలేదన్నారు.   నాయకులు తంగెడ రాజేశ్వర్‌రావు, శీలారపు పర్వతాలు, రాజేందర్‌, దాడి సం తోష్‌, రాజం మహంత కృష్ణ, సంపత్‌రావు, ఒల్లె తిరుపతి, రాపర్తి గోపి, దీలిప్‌, శ్రీకాంత్‌, ఉప్పుకిరణ్‌, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-05-02T05:53:16+05:30 IST