అన్ని వర్గాలకు సముచిత స్థానం
ABN , First Publish Date - 2021-05-09T04:52:02+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సముచిత స్థానం లభిస్తుందని వేములవాడ మున్సిపల్ చైర్‌ప ర్సన్ రామతీర్థపు మాధవిరాజు అన్నారు.

వేములవాడ, మే 8: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సముచిత స్థానం లభిస్తుందని వేములవాడ మున్సిపల్ చైర్‌ప ర్సన్ రామతీర్థపు మాధవిరాజు అన్నారు. వేముల వాడ పట్టణంలో రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ముస్లింలకు అందజేస్తున్న దుస్తులను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్‌బాబు సహకారంతో వేములవాడ పట్టణం లోని అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో పట్టణంలోని ముస్లింలకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు నరాల శేఖర్, నిమ్మశెట్టి విజ య్, మారం కుమార్, కో ఆప్షన్‌సభ్యులు షేక్ సర్వర్, అలీ పాల్గొన్నారు.