విద్యా, వ్యాపారాలకు కేంద్ర బిందువు జగిత్యాల

ABN , First Publish Date - 2021-12-15T06:35:41+05:30 IST

విద్యకు, వ్యాపారానికి అనువైన ప్రాంతం, కేంద్ర బిందువు లాంటిది జగిత్యాల అని స్థానిక ఎమ్మెల్యే డాక్ట ర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు.

విద్యా, వ్యాపారాలకు కేంద్ర బిందువు జగిత్యాల
సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ 

జగిత్యాల అర్బన్‌, డిసెంబరు 14: విద్యకు, వ్యాపారానికి అనువైన ప్రాంతం, కేంద్ర బిందువు లాంటిది జగిత్యాల అని స్థానిక ఎమ్మెల్యే డాక్ట ర్‌ సంజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలను ఎమ్మెల్యే సందర్శించి, కళాశాల విద్యార్థులతో ముచ్చ టించారు. కళాశాలల్లో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలు సుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే నిధుల నుంచి తక్షణమే నిధులు మంజూరు చేస్తున్నానని, నెలరోజుల్లోపే నిర్మాణాలు పూర్తి చేసి విద్యార్థు లకు అందుబాటులోకి తెచ్చేలా చూడాలని అధికారులను ఎమ్మెల్యే సం జయ్‌ ఆదేశించారు. తరగతి గదుల నిర్మాణంపై సీఎం, విద్యాశాఖ మం త్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు అయ్యేలా చూస్తానని హామీ ఇ చ్చారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉం దని తాను ఇదే కళాశాలలో చదువుకున్నానని ఈ కళాశాల అభివృద్ధికి తప్పక కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల అభివృ ద్ధితో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్‌ నిరంత రం కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్‌లు చుక్క నవీన్‌, అల్లె గంగసాగర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అరిఫ్‌, నాయకులు బోగ ప్రవీణ్‌, వొద్ది రాంమోహన్‌ రావు, సుమన్‌ రావు తదితరులున్నారు. 

Updated Date - 2021-12-15T06:35:41+05:30 IST