మెడికల్‌ కళాశాలతో నెరవేరిన దశాబ్దాల కల

ABN , First Publish Date - 2021-12-15T06:20:57+05:30 IST

నియోజకవర్గ ప్రజల దశాబ్దాల చిరకాల కల అయిన మెడికల్‌ కళాశాలను సాధించా మని, మూడేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించినట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు.

మెడికల్‌ కళాశాలతో నెరవేరిన దశాబ్దాల కల
మాట్లాడుతున్న ఎమ్మెల్యే చందర్‌

- మూడేళ్లలో ఎంతో సాధించాం

- ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని, డిసెంబరు 14: నియోజకవర్గ ప్రజల దశాబ్దాల చిరకాల కల అయిన మెడికల్‌ కళాశాలను సాధించా మని, మూడేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించినట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. నియోజకవర్గ ప్రజల దశాబ్దాల చిరకాల కల అయిన మెడికల్‌ కళాశాలను సాధించి పెట్టామన్నారు. అలాగే గోదావరిఖని సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును మంజూరు చేయించి ప్రారంభింప చేశామన్నారు. రూ.200కోట్ల నిధులతో నియోజవర్గంలో అభివృద్ధి చేయించామని, రూ.56కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో రామగుండం, అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేశామన్నారు. ము న్సిపల్‌ కార్యాలయం నుంచి ఫైవింక్లయిన్‌ చౌరస్తా వరకు రూ.10కోట్ల నిధులతో రోడ్డు విస్తరణ జరుగుతుందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ క్రింద 1726మంది లబ్ధిదారులకు రూ.17.28కోట్లు అందజేశామన్నారు. వెయ్యి మంది అనారోగ్య బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌, ఎల్‌ఓసీల ద్వారా రూ.6.54కోట్లు అం దించామన్నారు. అలాగే రూ.9.81కోట్ల ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ నిధులతో 14లక్షల మొక్కలను నాటించడం జరిగిందన్నారు. రాజీవ్‌ రహదారిపై ప్రమాదాల నివారణకు రూ.3.5కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులతో సర్వీస్‌ రోడ్లు నిర్మించామని, రూ.2.94కోట్లతో అన్ని డివిజన్లలో సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలు నిర్మించామన్నారు. లక్ష్మీనగర్‌లో వన్‌వే ట్రాఫిక్‌ను ఎ త్తివేయించామన్నారు. ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ నుంచి రూ.14.9కోట్లు మంజూరు చేయించామన్నారు. మ ల్కాపూర్‌ శివారులో రూ.28.5కోట్లతో 570, అర్బన్‌లో ఫైవింక్లయిన్‌లో రూ.41.5కోట్లతో 160 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. నియోజకవర్గం లో మహిళ స్వయం ఉపాధి కోసం రూ.11.04కోట్లు మంజూరు చేయించామన్నారు. అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో కమ్యూనిటీ హాల్స్‌, రైతు వేదికలు నిర్మించామన్నారు. చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 10వేల మందికి ఆర్థిక సహకారాన్ని అందించామన్నారు. 

మల్కాపూర్‌ శివారులో రూ.5కోట్లతో అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. మార్కండేయకాలనీ-ఎఫ్‌సీఐ, ఎఫ్‌సీఐ క్రాస్‌ రోడ్డు-గౌతమినగర్‌ వరకు రోడ్డు విస్తరణ, నిర్మాణం చేపట్టామన్నా రు. రూ.12కోట్లతో రామునిగుండాలపై వేంకటేశ్వరస్వామి టెంపుల్‌ను నిర్మిస్తామన్నారు. నియోజకవర్గానికి ఇండస్ర్టియల్‌ పార్కు, ఐటీ హబ్‌, పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు తెలిపా రు. విలేకరుల సమావేశంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-15T06:20:57+05:30 IST