317 జీఓను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-01-01T05:28:33+05:30 IST

ఉద్యోగ, ఉపాద్యాయుల బదిలీలల్లో అమలు చేస్తున్న 317 జీఓను రద్దు చేసి 374 జీఓ అమలు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

317 జీఓను రద్దు చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- ఉపాధ్యాయుల సీనియారిటీతో పాటు స్థానికతను పరిణలోకి తీసుకోవాలి

- ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి

సుభాష్‌నగర్‌, డిసెంబరు 31: ఉద్యోగ, ఉపాద్యాయుల బదిలీలల్లో అమలు చేస్తున్న 317 జీఓను రద్దు చేసి 374 జీఓ అమలు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌ ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల్లో స్థానికతను పరిగణలోకి తీసుకోకుండా కేవలం సీనియారిటీనే పరిగణలోకి తీసుకోవడం సరికాదన్నారు. సిరిసిల్లలో పనిచేసే ఉద్యోగి భూపాల్‌పల్లి జిల్లాకు బదిలీపై వెళ్లాల్సి వస్తోందన్నారు. పోలీసు కానిస్టేబుళ్లు ఎక్కడ పోస్టింగ్‌ వస్తుందోనన్న ఆందోళనలో ఉన్నారని అన్నారు. స్థానికత ఉత్తర్వులను ముఖ్యమంత్రి పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌, నాయకులు సమద్‌నవాబ్‌, ఎండి తాజ్‌, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, పోరండ్ల రమేశ్‌, తమ్మడి ఏజ్రా, నిహాల్‌అహ్మద్‌, శహింషా తదితరులు పాల్గొన్నారు.

  

Updated Date - 2022-01-01T05:28:33+05:30 IST