30 శాతం ఫిట్‌మెంట్‌

ABN , First Publish Date - 2021-03-23T04:35:19+05:30 IST

రాష్ట్ర ప్ర భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లులు కురిపించారు.

30 శాతం  ఫిట్‌మెంట్‌
మంచిర్యాలలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న టీఎన్‌జీఓస్‌

ఉద్యోగులపై సీఎం వరాల జల్లులు...

ఉద్యోగ విరమణ 61కి పెంపు

రిటైర్మెంట్‌ గ్రాట్యుటీ రూ. 16 లక్షలకు పెంపు

స్వాగతిస్తున్న ఉద్యోగ సంఘాలు

మంచిర్యాలలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

మంచిర్యాల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్ర భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లులు కురిపించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు పీ ఆర్సీలో 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నట్లు ప్రకటిం చారు. పెంచిన ఫిట్‌మెంట్‌ను ఏప్రిల్‌ 1 నుంచి అమ లు చేయనుండగా ఉద్యోగుల పదవీ విరమణ వయ స్సును 61 ఏళ్లకు పెంచారు. అలాగే రిటైర్మెంట్‌ గ్రా ట్యుటీ రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు పెం చుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పీఆర్సీకి సం బంధించిన 12 నెలల బకాయిలను చెల్లించడంతో పాటు విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కు టుంబ సభ్యులకు కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీ ఎస్‌)లో భాగంగా ఫ్యామిలీ పెన్షన్‌ విధానాన్ని అమ లు చేయడంపై ఉద్యోగులు, ఉపాఽధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగ తిస్తూ టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐ బీ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 

అంతర్‌జిల్లా బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌...

ఉద్యోగ, ఉపాధ్యాయ దంపతులకు అంతర్జిల్లా బ దిలీలు చేపట్టేందుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.  సీఎం హామీతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సంబం ధించి 300 మంది వరకు ఉండగా, వారందరికీ మే లు జరుగనుంది. దాదాపు 5 సంవత్సరాలుగా అంత ర్జిల్లా బదిలీల కోసం ఉద్యోగులు ధరఖాస్తులు చేసు కుంటున్నా తిరస్కరణకు గురయ్యాయి. కేసీఆర్‌ ప్రక టనలతో అంతర్జిల్లా బదిలీలకు మార్గం సుగమమైం ది. ప్రస్తుతం భార్యా భర్తలు వేర్వేరు జిల్లాలో ఉద్యో గాలు చేస్తుండటంతో మానసిక వేధనకు గురి అవు తున్నారు. ప్రస్తుతం ఆ ఇబ్బందులు తొలగిపోనుం డ గా వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అం తరాష్ట్ర బదిలీలకూ అడ్డంకులు తొలిగిపోయాయి. తె లంగాణలో పని చేస్తున్న జీవిత భాగస్వామి ఆంధ్ర ప్రదేశ్‌కు వెళ్లేలా చర్యలు చేపడతామని సీఎం ప్రక టించారు. 

ఉద్యోగులకు మేలు... 

పీఆర్సీ ప్రకటనలో భాగంగా చిరుద్యోగులకు సై తం మేలు చేకూరనుంది. ప్రభుత్వ యంత్రాంగంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్‌వాడీలు, ఆశావర్క ర్లు, సెర్ఫ్‌ ఉద్యోగులు, విద్యావలంటీర్లు, కేజీబీవీ సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగులు, వీఆర్‌ఏ, వీఆర్‌ఓ, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడెడ్‌ ఉద్యోగులకు కూడా వేతన పెంపు వ ర్తింపజేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే కేజీబీవీల్లో పని చేస్తున్న మహిళా సిబ్బందికి వేతనం తో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూ రు చేయడంతో హర్షద్వానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల సంఖ్యను 10వేలకు పెంచడం కూడా పదోన్నతులు పెరిగేందుకు దోహదపడనుంది. పెన్షనర్లకు ఇచ్చే 15 శాతం అదనపు వయోపరిమితిని 75 ఏళ్ల నుంచి 70 సంవత్సరాలకు తగ్గించడాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు స్వాగతిస్తున్నాయి. అయితే సీపీఎస్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించకపోవడం ఉద్యోగ, ఉపాధ్యా యుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తోంది.

సీఎం నిర్ణయం హర్షనీయం....

పోకల వెంకటేశ్వర్లు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు

ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల సీఎం కేసీఆర్‌ తీసు కున్న నిర్ణయం హర్షణీయం. సంవత్సరాలుగా పీఆర్సీ కోసం కళ్లు కాయలు కాసేలు ఎదురు చూడాల్సి వ స్తోంది. పీఆర్సీ ప్రకటించాలని ఆందోళనలు సైతం చే పట్టాము. ఉద్యోగ, ఉపాధ్యాయుల మొర ఆలకించిన సీఎం ఎట్టకేలకు ఆమోదయోగ్యమైన విధంగా ఫిట్‌ మెంట్‌, ఉద్యోగవిరమణ వయస్సు, తదితర అంశాల ను ప్రకటించారు. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. 

ఐక్యవేదిక పోరాట ఫలితమే పీఆర్సీ...

శాంతకుమారి, టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

ఉద్యోగ, ఉపాధ్యాయుల ఐక్యవేదిక పోరాట ఫలి తమే పీఆర్సీ ప్రకటన. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తు న్నాం. ముఖ్యమంత్రి అధికార ప్రకటనను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం విచారకరం. 30శాతం ఫిట్‌మెంట్‌ ప్రకారం మాస్టర్‌ స్కేల్‌ రూ పొందించాలి. అప్పుడే ఎక్కువ మంది ఉపాధ్యాయు లకు లాభం జరుగుతుంది. అలాగే 12 నెలల బకా యిలను పదవీ విరమణ తరువాత చెల్లించడం సరి కాదు. వీటిపై తక్షణమే జీఓ విడుదల చేయాలి. అ లాగే కేజీబీవీలు, ఆశ్రమ, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీస మూల వేతనం అమలు చేయాలి.   


  


Updated Date - 2021-03-23T04:35:19+05:30 IST