తెలంగాణ ప్రజల ప్రాణాలకు విలువ లేదా?: షర్మిల

ABN , First Publish Date - 2021-11-21T19:31:08+05:30 IST

ట్విటర్‌ వేదికగా సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.

తెలంగాణ ప్రజల ప్రాణాలకు విలువ లేదా?: షర్మిల

హైదరాబాద్: ట్విటర్‌ వేదికగా సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు, పినతల్లికి బంగారు గాజులు కొనిస్తాడటా.. అంటూ సెటైర్ వేశారు. బయట రాష్ట్ర రైతులకు రూ.3 లక్షలు ఇస్తారా?.. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులు, నిరుద్యోగులకు.. కరోనా మృతుల కుటుంబాలకు ఎన్ని లక్షలు ఇచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ప్రాణాలకు విలువ లేదా? అని వైఎస్‌ షర్మిల నిలదీశారు.

Updated Date - 2021-11-21T19:31:08+05:30 IST