చేయని తప్పుకు భారీ మూల్యం.. తల ఛిద్రమై..!

ABN , First Publish Date - 2021-10-21T14:34:54+05:30 IST

రింగు రోడ్డు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ...

చేయని తప్పుకు భారీ మూల్యం.. తల ఛిద్రమై..!

హైదరాబాద్ సిటీ/అబ్దుల్లాపూర్‌మెట్‌ : ఓ డ్రైవర్‌ నిర్లక్ష్యం యువకుడి ప్రాణాలను బలిగొంది. మరో యువకుడు గాయాలపాలయ్యాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ గ్రామ పంచాయతీ పరిధి జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన గడ్డం రమే‌ష్‌దాసు కుమారుడు రాజేష్‌దాసు (21) ప్రైవేటు ఉద్యోగి. అదే కాలనీకి చెందిన స్నేహితుడు ఎండీ అజార్‌తో కలిసి పల్సర్‌ బైక్‌పై వనస్థలిపురానికి బయలుదేరారు. విజయవాడ జాతీయ రహదారిపై పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగు రోడ్డు సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఓ వాహనం బలంగా ఢీ కొట్టడంతో బైక్‌ వెనుక కూర్చున్న రాజేష్‌దాసు తలఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. అజార్‌ తీవ్రగాయాలపాలయ్యాడు.  వాహనాన్ని డ్రైవర్‌ అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-10-21T14:34:54+05:30 IST