Tankbundపై సండే ఫండే.. ఆకర్షణగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్
ABN , First Publish Date - 2021-10-25T16:27:58+05:30 IST
ప్రతీ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సండే ఫండే...

హైదరాబాద్ సిటీ/కవాడిగూడ : ప్రతీ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సండే ఫండే కార్యక్రమంలో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్ నిలిచింది. భారత్ టీ 20 పురుషుల విభాగం ప్రపంచక్‌పలో పాల్గొంటున్న సందర్భంగా క్రీడాకారులకు ఉత్సాహం కల్పించేందుకు ట్యాంక్‌బండ్‌పై ఓ ప్రైవేట్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాట్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఆదివారం సండే ఫండే సందర్భంగా వచ్చిన క్రీడాభిమానులు, సందర్శకులు భారత్ టీ 20 కప్ గెలవాలంటూ బ్యాట్‌పై సంతకాలు చేసి సెల్ఫీలతో సందడి చేశారు. అదేవిధంగా తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాలికలు, యువతులు, మహిళలు ఆకతాయిల నుంచి ఆత్మరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలపై షీ టీమ్స్ ప్రతినిధులు ప్రదర్శన చేసి అందరికీ ధైర్యం చెప్పారు.

