హైదరాబాద్ వేదికగా ‘మిస్టర్ అండ్ మిస్ ఆసియా’ వేడుక

ABN , First Publish Date - 2021-12-25T06:11:00+05:30 IST

యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో డ్రీమ్ మేకర్స్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్కై జాయింట్ వెంచర్స్ ‘మిస్టర్ అండ్ మిస్ ఆసియా’ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం మాజీ మంత్రి మరియు తెలంగాణ విద్యుత్ మరియు వ్యవసాయ శాఖ సలహాదారు

హైదరాబాద్ వేదికగా ‘మిస్టర్ అండ్ మిస్ ఆసియా’ వేడుక

యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో డ్రీమ్ మేకర్స్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్కై జాయింట్ వెంచర్స్ ‘మిస్టర్ అండ్ మిస్ ఆసియా’ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం మాజీ మంత్రి మరియు తెలంగాణ విద్యుత్ మరియు వ్యవసాయ శాఖ సలహాదారు డా. వేణుగోపాలచారి ఆవిష్కరించారు. అందాల పోటీలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయని.. పాపులారిటీకి, సినిమా రంగానికి రాచబాటలు వేస్తాయని, ఈ పోటీలకు హైదరాబాద్ వేదిక కావడం గర్వకారణమని.. ఈ సందర్భంగా ఆయన అన్నారు. ‘మిస్టర్ అండ్ మిస్ ఆసియా మోడల్ 2021-22 సెలెక్షన్స్ హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని అట్లాస్ అపార్ట్‌మెంట్ రెండవ ఫ్లోర్‌లో నిర్వహించనున్నారు. ఇందులో ఎంపిక అయినవారు ఫినాలేలో తమ ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. ప్రముఖ సినీ దర్శకులు, నటులతో పాటు ప్రముఖ నృత్య దర్శకులు సలీం ఇలాహి వంటి ఇండియన్ సినిమాకు చెందిన ప్రముఖులు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారని మిస్టర్ అండ్ మిస్ ఆసియా నిర్వాహకురాలు- నటి ప్రియాన్షా దుబే తెలిపారు.


ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఢిల్లీ, భోపాల్, లక్నో, పూనే, బెంగళూరు వంటి ప్రముఖ పట్టణాల నుంచి 1000కి పైగా ఎంట్రీలు వచ్చాయని.. జనవరి 30, 2022న జరిగే ఫైనల్స్‌కి మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖాండేవాల్ మరియు మిస్టర్ ఇండియా స్టైల్ ఐకాన్ లక్ష్య శర్మ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారని స్కై జాయింట్ వెంచర్స్ సహ వ్యవస్థాపకురాలు, నటి మిస్ ప్రియాన్షా దుబే మరియు డ్రీమ్ మేకర్స్ ప్రొడక్షన్స్ ఎమ్.డి మీర్జా ఇంతియాజ్ బేగ్ తెలిపారు. తమ సంస్థలు యువతను ప్రోత్సహించడానికి ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లుగానూ, ఫైనల్స్‌లో 100 మంది ప్రతిభావంతులైన యువత పాల్గొంటారని ఆశిస్తున్నట్లుగా వారు తెలియజేశారు.

Updated Date - 2021-12-25T06:11:00+05:30 IST