వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌ రద్దు అంటూ మెసేజ్‌లు

ABN , First Publish Date - 2021-05-08T18:02:59+05:30 IST

సెకండ్‌ డోస్‌ టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న..

వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌ రద్దు అంటూ మెసేజ్‌లు

హైదరాబాద్/రాజేంద్రనగర్‌ : సెకండ్‌ డోస్‌ టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న కొందరికి ‘మీ రిజిస్ట్రేషన్‌ రద్దు అయింది. తిరిగి రిజిస్ట్రేషన్‌ చేసుకోండి’ అంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో పలువురికి ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయి. ఒకసారి రిజిస్ట్రేషన్‌ కోసం ఎంతో సమయం పడుతోందని, తీరా రిజిస్ట్రేషన్‌ చేస్తే ఇలా మెసేజ్‌ రావడం ఏంటని అంటున్నారు. కొందరు ఇంటర్నెట్‌ సెంటర్లు, మీ సేవా కేంద్రాలకు వెళ్లి మరీ రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా, రిజిస్ట్రేషన్‌ రద్దు కావడంతో అయోమయానికి గురవుతున్నారు.

Updated Date - 2021-05-08T18:02:59+05:30 IST