కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రుల భేటీ

ABN , First Publish Date - 2021-11-24T01:18:51+05:30 IST

న్యూఢిల్లీ: కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, టిఆర్ఎస్ ఎంపీలు, అధికారులు భేటీ అయ్యారు.

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రులు, టిఆర్ఎస్ ఎంపీలు, అధికారులు భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రత్యేక సీఎస్ రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎంపీలు, కేంద్ర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో రైతుల ఇబ్బందులతో పాటు అందుబాటులో ఉన్న ధాన్యం రబీ పంట కొనుగోళ్ల అంశాలను కేంద్ర మంత్రికి వివరించారు. అంతకు ముందు గోయల్‌తో సమావేశం కోసం మంత్రులు కృషి భవన్లో మూడున్నర గంటల పాటు ఎదురుచూశారు. అమెరికా అధికారిక వాణిజ్య బృందంతో సమావేశం తర్వాత పీయూష్ గోయల్ తెలంగాణ బృందాన్ని కలిశారు. 

Updated Date - 2021-11-24T01:18:51+05:30 IST