‘టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభా‌ష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2021-05-30T13:40:14+05:30 IST

భూకబ్జా ఆరోపణలపై ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభా‌ష్‌రెడ్డిపై

‘టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభా‌ష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి’

హైదరాబాద్/ఉప్పల్‌ : భూకబ్జా ఆరోపణలపై ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభా‌ష్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నాయకులు ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీజేపీ నాయకులు డాక్టర్‌ శిల్పారెడ్డి, రేవల్లి రాజు, గోనె శ్రీకాంత్‌ ముదిరాజ్‌, రెడ్డిగారి దేవేందర్‌రెడ్డి ఉప్పల్‌ అడ్మిన్‌ ఎస్సై జయరామ్‌కు ఫిర్యాదు అందజేశారు. కాప్రా మండలంలో సర్వే నెం.152లో భూకబ్జా విషయంలో ఎదుర్కొంటున్న ఆరోపణలకు సంబంధించి గత కొన్ని రోజులుగా బీజేపీ నియోజవర్గం వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-30T13:40:14+05:30 IST