విద్యార్థికి ఫిట్స్‌.. ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటిన Traffic Constable

ABN , First Publish Date - 2021-12-08T13:48:47+05:30 IST

ఫిట్స్‌తో బాధపడుతున్న పాలిటెక్నిక్‌ విద్యార్థినిని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ తన మానవత్వాన్ని చాటుకున్నారు.

విద్యార్థికి ఫిట్స్‌.. ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటిన Traffic Constable

హైదరాబాద్ సిటీ/బర్కత్‌పుర : ఫిట్స్‌తో బాధపడుతున్న పాలిటెక్నిక్‌ విద్యార్థినిని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ  సంఘటన మంగళవారం కోఠి ఉమెన్స్‌ కళాశాల గేటు వద్ద జరిగింది. ఆసిఫ్‌నగర్‌ దత్తాత్రేయ కాలనీలో నివాసం ఉంటున్న సురేష్‌కుమార్‌ కుమారుడు బి.ఉదయ్‌కుమార్‌ (16) మీర్‌పేటలోని టీఆర్‌ఆర్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కోఠి ఉమెన్స్‌ కళాశాల గేటు వద్ద ఉదయ్‌కుమార్‌ ఫిట్స్‌తో పడిపోయాడు. అక్కడనే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కృష్ణ (పీసీ 5279) వెంటనే గమనించి ఆ బాలుడిని చికిత్సకోసం బొగ్గులకుంటలోని ఆదిత్య ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో ఆస్పత్రికి చేర్పించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఉదయ్‌కుమార్‌ ద్వారా వివరాలు తెలుసుకొని అతని తల్లిదండ్రులకు కానిస్టేబుల్‌ కృష్ణ సమాచారం అందించారు. సకాలంలో ఆస్పత్రిలో చేర్పించినందుకు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కృష్ణను ఉదయ్‌కుమార్‌ తల్లిదండ్రులు, బంధువులు, సుల్తాన్‌బజార్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌కుమార్‌ అభినందించారు.

Updated Date - 2021-12-08T13:48:47+05:30 IST