వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-20T16:50:48+05:30 IST
ఆర్ధిక ఇబ్బందులతో ఉరేసుకొని మహిళ మృతిచెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల

నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో..
హైదరాబాద్/పేట్‌బషీరాబాద్: ఆర్ధిక ఇబ్బందులతో ఉరేసుకొని మహిళ మృతిచెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభా్‌షనగర్‌కు చెందిన శంభూప్రసాద్, ఉషాదేవి(45)లు భార్యాభర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల 18న రోజు మాదిరిగానే తండ్రీకొడుకులు పనికి వెళ్లగా కూతురు కాలేజీకి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉషాదేవి ఉరేసుకొని మృతిచెందింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మానసిక ఒత్తిడితో విద్యార్థిని..
మియాపూర్: ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మియాపూర్ మైహోం జ్యువెల్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే వీరేంద్రసింగ్ నేగి కుమార్తె ఓ ప్రైవేట్ కళాశాలలో 12వ తరగతి చదువుతుంది. చదువు విషయంలో మానసిక ఒత్తిడికి గురైంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో 9వ అంతస్తు నుంచి దూకింది. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మనస్తాపంతో మహిళ..
హైదర్‌నగర్: ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేపీహెచ్‌బీ పోలీ్‌సస్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేపీహెచ్‌బీకాలనీ ఎంఐజీ-197లో నివాసం ఉండే ఎల్లయ్య, వెంకటమ్మల కుమార్తె మమతను 2019లో శ్యామ్‌కు ఇచ్చి వివాహం చేశారు. కాగా రెండునెలలకే అతడికి కేన్సర్ అని తెలియడంతో విడాకులు తీసుకుని తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. మమత నిజాంపేటలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. కాగా మంగళవారం ఆరోగ్యం బాలేకపోయినా విధులకు వెళ్లేందుకు బయలుదేరుతుండగా తండ్రి వారించాడు. కుమార్తె పనిచేస్తున్న వారికి ఫోన్ చేసి మమత ఈ రోజు రావడం లేదని సెలవు కావాలని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన మమత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.