హైదరాబాద్‌లో బ్యాంకులను ముంచేస్తున్న కేటుగాళ్లు!
ABN , First Publish Date - 2021-07-08T19:54:06+05:30 IST
నకిలీ పత్రాలను బ్యాంకులో తనఖాపెట్టి మోసం చేసిన ముగ్గురు నిందితులను...

- కేపీహెచ్‌బీ పరిధిలో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్ సిటీ/హైదర్‌నగర్ : నకిలీ పత్రాలను బ్యాంకులో తనఖాపెట్టి మోసం చేసిన ముగ్గురు నిందితులను కేపీహెచ్‌బీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గొట్టిముక్కల సత్యనారాయణరాజు, కోటకొండ విక్రమ్‌బాబు, యూస్‌ఫఖాన్ మరో నలుగురితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఫ్లై హై ఎంటర్‌ప్రైజెస్ పేరుతో మాదాపూర్‌లో ఓ నకిలీ కంపెనీ ఏర్పాటు చేశారు. కంపెనీ పేరుపై రుణం కోసం కూకట్‌పల్లి సెంట్రల్ బ్యాంక్‌ను సంప్రదించారు. వారు ఏదైనా ఆస్తిని గ్యారెంటీగా పెడితే లోన్ ఇస్తామని చెప్పారు.
దీంతో విక్రమ్‌బాబు, యూసు్‌ఫఖాన్ తమ కార్యాలయం ఉన్న ఫ్లాట్ సత్యనారాయణరాజు పేరుపై రిజిస్ర్టేషన్ అయినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. వాటిని బ్యాంకు అధికారులకు సమర్పించి రూ. 70 లక్షలు రుణం తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఫ్లాట్‌కు వెళ్లి పరిశీలించగా నకిలీ పత్రాల గుట్టు తెలిసింది. దీంతో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారు. కోటకొండ విక్రమ్‌బాబు గతంలో కూడా బ్యాంకులను మోసం చేసి కోట్లు ఎగ్గొట్టినం దుకు సీబీఐ కేసు కూడా ఉందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.