ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలపై పాపారావు హర్షం

ABN , First Publish Date - 2021-03-22T21:58:40+05:30 IST

ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించడంపై తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షులు,

ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలపై పాపారావు హర్షం

హైదరాబాద్: ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించడంపై తెలంగాణ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్స్ అసోషియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కె. పాపారావు హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పీఆర్సీని ప్రకటించి, ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నుదన్నుగా నిలిచారన్నారు. ఉద్యోగుల పక్షపాతిగా ముద్ర వేసుకున్నారని, ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగులకు  ప్రకటించిన వరాలు చరిత్రాత్మకం అన్నారు. కేసీఆర్ పాలనలో ఉండటం అదృష్టవంతులని అన్నారు.  

Updated Date - 2021-03-22T21:58:40+05:30 IST