తెలంగాణ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-14T13:39:36+05:30 IST

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

తెలంగాణ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

హైదరాబాద్: రాష్ట్రంలో  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 5 కేంద్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. లెక్కింపు కోసం ఆదిలాబాద్‌లో 6, కరీంనగర్‌లో 9 టేబుళ్లను ఏర్పాటు చేయగా... మిగితా కేంద్రాల్లో ఐదు టేబుళ్లను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలలోపు ఫలితాలు వెలువడనున్నాయి. ప్రతి రౌండ్‌లో 200 ఓట్లను  లెక్కించనున్నారు. మరోవైపు కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-12-14T13:39:36+05:30 IST