తెలంగాణ కేబినెట్‌ భేటీ.. లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం!

ABN , First Publish Date - 2021-05-30T19:49:53+05:30 IST

ఉ. 6 నుంచి మ. 12 గంటల వరకు సడలింపు ఇచ్చే అవకాశాన్ని కూడా కేబినెట్ పరిశీలిస్తోంది. వారం తరువాత నైట్ కర్ఫ్యూ పెట్టే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.

తెలంగాణ కేబినెట్‌ భేటీ.. లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం!

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనుంది. మరో వారం, పది రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉంది. ఉ. 6 నుంచి మ. 12 గంటల వరకు సడలింపు ఇచ్చే అవకాశాన్ని కూడా కేబినెట్ పరిశీలిస్తోంది. వారం తరువాత నైట్ కర్ఫ్యూ పెట్టే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్‌పై కేబినెట్‌లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఉద్యోగాల నోటిఫికేషన్‌పై కూడా చర్చించనున్నారు. వ్యవసాయంపై లాక్‌డౌన్ ప్రభావం పడకుండా నిర్ణయం తీసుకునే యోచనలో కేబినెట్ ఉంది. 

Updated Date - 2021-05-30T19:49:53+05:30 IST