అసెంబ్లీ ముందు భారీగా పోలీసుల మోహరింపు

ABN , First Publish Date - 2021-03-24T18:16:16+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ముందు భారీగా పోలీసులు మోహరించారు.

అసెంబ్లీ ముందు భారీగా పోలీసుల మోహరింపు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఇంకా రెండు రోజులే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జిల్లాల నుండి ప్రజలు అసెంబ్లీ ముట్టడికి వస్తున్నారు. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ  వేములవాడ ప్రజలు మరోమారు అసెంబ్లీని ముట్టడించారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు  చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను సస్పెండ్ చేయలని డిమాండ్ చేస్తూ  బీజేపీ ఎస్సీ మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. అలాగే కరీంనగర్ మిడ్ మనేరు ప్రాజెక్ట్‌కు రూ.100 కోట్లు నిధులు, కొండగట్టు అభివృద్ధికి నిధులు, వేములవాడ అభివృద్ధికి నిధులు కేటాయించాలంటూ  కాంగ్రెస్ కిసాన్ అసెంబ్లీని ముట్టడించింది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన పొన్నం ప్రభాకర్...సీఎం కేసీఆర్  ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముత్యంపేట్ నిజం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని జగిత్యాల జిల్లా రైతులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి వస్తూ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు  నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

Updated Date - 2021-03-24T18:16:16+05:30 IST