రేవంత్, ఎమ్మెల్యే సండ్రలకు సుప్రీంలో ఊరట

ABN , First Publish Date - 2021-08-25T18:40:37+05:30 IST

ఓటుకు నోటుకు కేసు నుండి తన పేరును తొలగించాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది.

రేవంత్, ఎమ్మెల్యే సండ్రలకు సుప్రీంలో ఊరట

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఓటుకు నోటు కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి  రాదంటూ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇదే కేసులో తన పేరును తొలగించాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ  హైకోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులపై కూడా ఉన్నతన్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించ తదుపరి విచారణను సుప్రీం కోర్టుకు సెప్టెంబర్ 7కు వాయదా వేసింది.

Updated Date - 2021-08-25T18:40:37+05:30 IST